Jun 22,2023 13:22
  • పర్యవేక్షణ లేకనే సచివాల సిబ్బంది  వాలంటీర్ల విధుల్లో  నిర్లక్ష్య వైఖరి 

ప్రజాశక్తి ఆత్మకూరు : ఆత్మకూరు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామసచివాలయాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ మండలంలో నీరు గారు పోతుంది అనడానికి అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రత్యేక కారణమని చెప్పవచ్చును. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లాలన్న దృఢ సంకల్పంతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ నేడు మండలంలో అన్ని గ్రామ సచివాలయలలోనూ ప్రజలకు సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయని, చెప్పవచ్చును. మండలంలోని దాదాపు 11 గ్రామ సచివాలయాల్లో, దాదాపు 11 నుండి  13 మంది దాకా సచివాల సిబ్బంది, ఒక్కొక్క గ్రామ సచివాలయాలలో దాదాపు పది నుండి 18 దాకా గ్రామ వాలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్ల విధి నిర్వహణపై, మండల పరిషత్ అధికారులు, సంబంధిత అధికారులు ఏమాత్రం పర్యవేక్షణ చేయకపోవడం వల్లే, గ్రామ సచివాలయంలో సిబ్బంది వాలంటీర్ల పనితీరు అంతంత మాత్రం గానే జరుగుతున్నాయని, ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి , ప్రజలకు అనుసంధాన కర్తులుగా, సారథులుగా విధులు నిర్వహించాల్సిన వాలంటీర్లు సచివాల సిబ్బంది, కేవలం వేతనం కోసమే, సచివాలల్లో హాజరవుతూ, బయోమెట్రిక్ అనంతరం సొంత పనులపై వెళ్తున్నారని ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది, మండల అధికారులు పూర్తిగా పర్యవేక్షణ లేకపోవడం వల్లే సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల విధి నిర్వహణ వారు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతుందనే, ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గ్రామస్థాయిలోని ప్రజాప్రతినిధులకు తెలియకుండా వాలంటీర్లు, సచివాల సిబ్బంది  తోడుదొంగుల్ల దోబూచులాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు కూడా ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యమే సచివాల సిబ్బంది వాలంటీర్ల విధి నిర్వహణకు ప్రత్యేక కారణమని చెప్పవచ్చును. ఇప్పటికైనా ఇలా ఉన్నంత అధికారులు స్పందించి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు