ప్రజాశక్తి-వెదురుకుప్పం : మండలం పాతగుంట ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్ర సిబ్బంది పనితీరుపై జిల్లా టీకా అధికారి డాక్టర్ రవిరాజు గురువారం అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని ఆదేశించారు. సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పైర్ అయ్యారు. ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రం పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పచ్చికాపల్లం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.










