ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని చామలూరు నిలువురాయి గ్రామాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులను బుధవారం ఎంపీడీవో దివాకర్ ఈ ఓ ఆర్ డి లక్ష్మీనరసింహతో కలిసి మండల ప్రత్యేక అధికారి మహమ్మద్ రఫీ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నాడు నేడు పనులు పరిశీలించి వాటి యొక్క పురోగతి గురించి ఇంజనీరింగ్ సహాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణీలకు చిన్నారులకు పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందజేయాలని సూచిచారు. అదేవిధంగా గ్రామ సచివాలయంను సందర్శించి సచివాలయ సిబ్బంది ఒక పనితీరు మీద సమీక్ష చేశారు. సచివాలయంలోని ఉద్యోగుల మూమెంట్ రిజిస్టర్ తదితర రిజిస్టర్లను రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రతి సచివాలయంలో మూడు గంటల నుంచి 5 గంటల వరకు ప్రతి ఉద్యోగి అందుబాటులో ఉండి గ్రీవెన్స్ నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.










