Mar 22,2023 12:29
  • ఏపిఎం తిప్పమ్మ .

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక మహిళా మార్ట్ లో బలవంతపు అమ్మకాలు ఆందోళనలో మహిళా సంఘాల సభ్యులు అన్న కథనం శనివారం ప్రజాశక్తి దినపత్రికలో రావడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నార్పల వెలుగు ఏపీఎం తిప్పమ్మ వెలుగు సీసీలు యానిమేటర్లు స్పందించారు. వారు వెలుగు సిబ్బందితో కలిసి స్థానిక వెలుగు కార్యాలయంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా మార్టులో బలవంతపు అమ్మకాలు అనే కథనంపై వివరణ ఇస్తూ నార్పల మహిళా చేయూత మార్టు మండలంలోని అన్ని గ్రామైక్య సంఘాల సహకారంతో సంఘాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంఘ సభ్యులు కుటుంబ అవసరాల నిమిత్తం నిత్యవసర వస్తువులు చేయూత మహిళా మార్ట్ లో తీసుకుంటే మర్ట్ ఆదాయం పెరిగి సంఘ సభ్యులు పెట్టిన పెట్టుబడిని తొందరగా తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలపడం జరిగింది. అంతేకానీ ప్రతి సంఘము కచ్చితంగా ప్రతినెల ఇన్నివేల రూపాయల సరుకులు కొన్ని తీరాల్సిందేనని ఎటువంటి నిబంధనలు పెట్టలేదని ఎవరైనా సంఘ సభ్యులను బలవంత పెట్టిన బెదిరింపులకు పాల్పడిన తమ దృష్టికి తీసుకొని వస్తే అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎం సునీత సీసీలు రామకృష్ణ, నాగానంద, పుల్లారెడ్డి, అకౌంటెంట్ కోటేశ్వరమ్మ యానిమేటర్లు చేయూత మార్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.