May 06,2023 14:55

ప్రజాశక్తి - గంగాధరనెల్లూరు(చిత్తూరు) : నిరుద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు రాకుండా తీరని అన్యాయం జరిగిందని నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ భీమినేని  చిట్టిబాబు నాయుడు ధ్యజమెత్తారు. గంగాధర నెల్లూరు టిడిపి కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పలువురు పట్టభద్రులతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని ఆంధ్ర రాష్ట్రం మత్తుకు బానిసై మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడం చూస్తేనే మన రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఇట్లే అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి హామీలతో నిరుద్యోగులు మోగా డీఎస్సీ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  ఆరు మండలాల టీడీపీ అధ్యక్షులు స్వామిదాస్, చెంగల్రాయాదవ్, లోకనాథ్ రెడ్డి, జయశంకర్ నాయుడు, రుద్రయ్య నాయుడు, రాజేంద్రన్, జిల్లా టిడిపి యాదవ సాధికార కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, రాష్ట్ర టీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి రావిళ్ల లోకేష్, పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి కేతినేని లోకేష్ నాయుడు, పార్లమెంట్ టిడిపి ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి దేవసుందరం, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి జ్యోతి రెడ్డి, మండల బీసీసెల్ అధ్యక్షుడు జ్యోతి యాదవ్, పార్లమెంటు వాణిజ్యవిభాగం అధికార ప్రతినిధి కామసాని కోదండరెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ దేవరాజులు, నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు రవి యాదవ్,  నేతలు నీరజాక్షులురెడ్డి, చిదంబరం, ఉలగనాదం, గోపి పాల్గొన్నారు.