- విద్యార్థులు బడికి రాక.. విద్యాలయాలు మూత..!
- నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నా..
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నా... మధ్యాహ్న భోజనం పెట్టుతున్నా విద్యా కానుక ఇస్తున్నా విద్యార్థులు మాత్రం రారు.. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం పెట్టిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఎంపికైన్నా..విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటు పాఠశాలల వైపే ముగ్గు చూపుతున్నారు .ఎందుకిలా..? అక్కడ చదువులు చెప్పేది ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోల్చితే క్వాలిఫికేషన్ తక్కువే.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుల్లో ఎంతో మార్పులు చేస్తున్నా.. ప్రజాప్రతినిధులు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నా.. ఏమాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులు సరిగా చదువులు చెప్పరు అని తల్లిదండ్రుల అభిప్రాయం. ఎందుకిలా..? ఆయిన ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదువులపై ప్రజల్లో నమ్మకం కల్పించలేకపోతున్నారు ఉపాధ్యాయులు. ఫలితంగా చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలంలో ఈ ఏడాది ఐదు ప్రాథమిక పాఠశాలలో మూతపడ్డాయి. మరో మూడు అదే దారిలో ఉన్నాయి. గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో సద్దికూళపల్లె, చిన్న బొమ్మయ్య పల్లె కాలనీ, తోటానపల్లి ,గుండుపల్లి ,గంటవారిపల్లి ,ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేకుండా మూతపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎంఈఓ ల చెప్పేది కూడా ఇదే.. సంత బయలు ,తాటిమాకుల పల్లె బడుల్లో ముగ్గురేసి విద్యార్థులు ఉన్నారు, ఇక వావిలి చేను ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక టీచరు మాత్రం బడికి వస్తున్నాడు, అయితే ఇక్కడ పనిచేస్తున్నా ఉపాధ్యాయుడిని తిరుమలయ్యపల్లి స్కూల్ కి డిప్యూటేషన్కు పంపినట్లు ఎంఈఓ 2 దామోదరం తెలిపారు. ఇటీవల వరకు ఆ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఉన్న వారు టీసీ తీసుకెళ్లడంతో ఆ పరిస్థితి నెలకొనిందని స్థానికులు అంటున్నారు. అదే గ్రామం నుంచి 13 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలకు వ్యాన్లో వెళుతుండడం ఆశ్చర్యకర విషయం .సద్దికూళపల్లి ,తోటనపల్లి పాఠశాలలు మాత్రం మూతపడినట్లు ఆ మేరకు జిల్లా విద్యాశాఖకు సమాచారం ఇచ్చినట్లు ఎంఈఓ 2 దామోదరం తెలిపారు. గుండుపల్లి గంటావారి పల్లె, గుండుపల్లి ప్రాథమిక పాఠశాలలో మూతపడడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వావిలిచేనులో ఇద్దరు పిల్లలు టీసీలు తీసుకెళ్లడంతో కాళీ అయిందని అన్నారు. మళ్ళీ తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను చేర్పించేలా చర్యలు తీసుకుంటామని, స్థానిక నాయకులు చెబుతున్నారు వారి ప్రయత్నం ఫలించలేదు.
సంతబైలు గ్రామంలో స్థానిక సర్పంచ్ బోడి రెడ్డి రాజేశ్వరి పెద్దిరెడ్డి, స్థానిక ఎంపీటీసీ భర్త బట్టే సుబ్రమణ్యంతో కలసి ఎంఈఓ లు స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారికి అవగాహన కల్పించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న లోకనాథం విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిరోజు కలుస్తున్నట్లు చెబుతున్నారు. వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలని కొందరి అభిప్రాయం.
- స్థానిక నాయకులతో కలిసి గ్రామాల్లో అవగాహన కల్పించాం : మహేశ్వరరావు, దామోదరం ఎంఈఓలు వెదురుకుప్పం
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు సంఖ్య తగ్గిన పాఠశాలలను గుర్తించి ఆ గ్రామానికి వెళ్లి స్థానిక సర్పంచ్ ప్రజాప్రతినిధులతో సమావేశాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాము పిల్లలను బడిలో చేర్పించాలని కోరాము. గ్రామీణ ప్రాంతాలలో మాకు రాకపోతే ప్రభుత్వ నిబంధనల మేరకు నివేదికను పై స్థాయి అధికారులకు అందజేస్తాం.










