Feb 13,2023 15:39

ప్రజాశక్తి-పలమనేరు : పలమనేరు రూరల్ అడవిసమీప గ్రామాలైన మొసలిమడుగు, కాలవపల్లి  దొమ్మరపాపమ్మ గుడి పక్కనున్న చెరువు, పెద్దూరు చెరువు, కొత్త చెరువుల క్రింద ఉన్న ఆయకట్టు రైతులకు చెందిన సుమారు 120 ఎకరాలపైన వ్యవసాయ భూములు పూర్తిగా బీడుభూములుగానే వదిలేశారు. అలాగే మొసలిమడుగు గ్రామసమీపాన గల చెరువుల క్రింద వున్న ఆయకట్టు రైతులకు చెందిన సుమారు 90 ఎకరాలపైన సారవంతమైన భూములు కూడా గత రెండు సంవత్సరాలుగా ఇప్పటికీ బీడుభూములుగానే వదిలేశారు. ఈ గ్రామంలో గతంలో ఎప్పుడూ వరి పంటలే ఎక్కువగా పండించి రైతులకు కావలసి ధాన్యాన్ని పెట్టుకుని మిగిలిన ధాన్యాన్ని అమ్ముకునేవారు ఇప్పుడు రెండు సంవత్సరాలుగా ఈ ఏనుగులకు భయపడి పూర్తిగా బీడుభూములుగా వదిలేయడం వలన పంట పండించే రైతులకు కూడా తినెందుకు వడ్లు లేక ఒక కింటాలు వడ్లు ధర 2200 రూపాయలకు ఇప్పుడు కొనుక్కుని తింట్టున్నారు. గత మూడు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులలో బోరు బావులలో పుష్కలంగా నీరు( ఉన్నా అల్లుడు నోట్లో శనే) అనే సామిత లాగా ఈ  అటవిసమీప ప్రాంతాల్లోని రైతుల పరిస్థితి. పంట పెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులుచేసి వేసిన పంటలపై ప్రతినిత్యం గుంపులవారీగా ఏనుగులు వచ్చి వేసిన పంటలు చేతికందకనే నష్టపరుస్తూన్న కారణంగా ఈ ప్రాంత రైతులు పూర్తిగా నష్టపోతూనేవున్నారు. ఈ పంటనష్టాలకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారమైనా ఆదుకుంట్టాదని అనుకుంటే అది కూడా అంతంత మాత్రమే ఎకరాకు వెయ్యి రెండువేలతో సరిపెట్టి చేతులు దులుపుకుంట్టున్నారే కాని ప్రస్తుతం ఒక ఎకరా వరిపంట పెట్టుబడుల ఖర్చు కనీసం 50 వేల నుండి 55 వేల రూపాయలు ఖర్చులు పెట్టాలి. కాని ప్రభుత్వం పంటనష్టాలకు తగిన నష్టపరిహారం ఇవ్వక ఎప్పుడో గత 2014వ సంవత్సరం ప్రవేశపెట్టిన పాత జీఓనే ఇప్పటికి కొనసాగిస్తూ రైతులను మోసగిస్తున్నారు. ప్రస్తుత పంటలవారీగా పంటపెట్టుబడుల అంచనాలతో  మార్కెట్ రేటు ప్రకారం కొత్త జీఓను ప్రవేశపెట్టి .ఆ జీఓ ప్రకారం ఇవ్వాలని. లేక పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఎకరా వరి పంటకు 24 వేల రూపాయలు ఇస్తున్నారు. అదే కర్నాటక రాష్ట్రంలో కూడా 62 రకరకాల పంటలకు నష్టపరిహారం చెల్లిస్తూ గత 20 రోజులకు ముందు పాత జీఓను రద్దుపరచి కొత్త జీఓను ప్రవేశపెట్టి ఆంతకు రెండింతలు రెట్టింపు చేసింది. ఇక్కడ మన ప్రభుత్వం ఇవేమీ చేపట్టక పాత జీఓనే కొనసాగిస్తూ కనీసం ఆ జీఓ ప్రకారం కూడా ఇవ్వక రైతులను ఆత్మహత్యలకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాత జీఓను రద్దుపరచి పక్కనున్న తమిళనాడు .కర్నాటక రాష్ట్రాలలో ఇస్తున్న విధంగా ఇక్కడ కూడా ఏనుగులవలన పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి పెండింగులో ఉన్న సోలార్ ఫెన్సింగ్ పనులను వెంటనే ఏర్పాటు చేసి అటవిసమీప  రైతులను ఏనుగుల బారినుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.