Jul 17,2023 15:55
  • దగ్గులూరులో మెడికల్ కాలేజీ నిర్మాణంపై ఎంఎల్ఏ నిమ్మల

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం సిఎం జగన్ బటన్ నొక్కి మూడున్నర సంవత్సరాలు అయిన 3 రూపాయల పని జరగలేదని ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆయన మండలంలోని దగ్గులూరులో నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజీని సోమవారం బస్ యాత్ర సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చాక వారు పూర్తి చేస్తారని నమ్మకంతో ఉన్నారని చెబుతున్నారు అన్నారు. రైతులు ఇచ్చిన భూమి కనీసం చదును చేయలేదని చెప్పారు.ప్రజలను మభ్యపెట్టడానికే ఆయన ఉత్తుత్తి బటన్ నొక్కుతున్నారని చెప్పారు. సేకరించిన రైతులు సొమ్ము ఇవ్వడానికి 2 సంవత్సరాలు అయిందని చెప్పారు.ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం నత్తనడకగా సాగుతోందని చెప్పారు. ఇంకా మాజీ మంత్రి చినరాజప్ప, టిడిపి నేతలు కర్నేన గౌరు నాయుడు, పెచ్చెట్టి బాబు, కోడి విజయ భాస్కర్, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, పెన్మెత్స రామభద్రరాజు పాల్గొన్నారు.