Feb 22,2023 16:12
  • టిడ్కో గృహాలు పూర్తిచేసి ఇవ్వాలని డిమాండ్ ..

పాలకొల్లు : జిల్లాలో  ఎన్టీఆర్ టిడ్కో గృహాల పనులు వెంటనే పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేసారు. బుధవారం ఉదయం 5 గంటలకు నిద్రలేచి సైకిల్ పై  17వ వార్డులోని ఇళ్ళకు వెళ్లి పేపర్ వేసి నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో 7158 ఇళ్ళు పాలకొల్లులో మంజూరు చేసి 90% ఇళ్లను పూర్తిచేసామని చెప్పారు. మిగిలిన 10% ,3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా 4 సంవత్సరాలు అయిన  ఒక అర బస్తా సిమెంట్, రూపాయి కానీ ఖర్చు పెట్టకుండా, ఈరోజు  ఇళ్ళకు రంగులు  వేసారని, రంగులపై ఉన్న శ్రద్ధ ఇళ్ళు పూర్తిచేసి ఇవ్వడం పైన లేదని నిరసిస్త ఉన్న సైకిల్ పై పేపర్ వేసారు.ఆరోజు ఉచితమని చెప్పి ఈరోజు రుణాలు పేరుతో బ్యాంకులకు తాకట్టు పెట్టడం, పెదగరువులో  కట్టవలసిన ఇళ్లను రద్దు చేయడం, పట్టణంలో ఉన్న లబ్ధిదారులకు 15,20 కిలోమీటర్ల దూరంలో కాజ గొప్పులో పీక లోతు నీళ్ళల్లో ఉన్న ముంపు భూమిలో, సెంటు పట్టా ఇచ్చి మోసం చేయడాన్ని నిరసిస్తూ, తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న జగన్ ను నిద్రలేపడానికి  సైకిల్ పై పేపర్లు వేసి నట్లు చెప్పారు