ప్రజాశక్తి-పాలకొల్లు : వాహనదారులకు నాణ్యమైన, ఖచ్చిత కొలతలతో పెట్రోల్ సరఫరా చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కోరారు. పాలకొల్లు ఉల్లంపర్రు నందు బుధవారం జెడ్పీటీసీ నడపన గోవింద రాజుల నాయుడు నిర్వహించే "శ్రీరామచంద్ర ట్రడర్స్" నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, ఎం ఎల్ ఏ నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, చెల్లెం ఆనంద్ ప్రకాష్, వేండ్ర వెంకటస్వామి, యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబు, చిలువూరి దత్తాత్రేయ వర్మ, అడబాల వెంకటరమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు మండల ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి ఏడుకొండలు, గయలమంచిలి ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జి , సుమంగలి పాల్గొన్నారు.










