ప్రజాశక్తి-వెదురుకుప్పం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి చొరవతో మూడు మండలాల సరిహద్దులలో నూతన బస్సు సర్వీస్ లను ప్రారంభించేందుకు జిల్లా జనరల్ సెక్రెటరీ కామసాని పద్మనాభరెడ్డి చర్యలు చేపట్టారు. కొత్తగా రోడ్డు పనులు జరుగుతున్న సమయాలలో ప్రజలు పడుతున్న కష్టాలను గమనించిన జిల్లా జనరల్ సెక్రెటరీ కామసాని పద్మనాభరెడ్డి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రజలు బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని ఆయనకి తెలియపరచారు. నూతన బస్సు సౌకర్యం కల్పించాలని డిప్యూటీ సీఎం ను అడగగా ఆయన వెంటనే స్పందించి చిత్తూరు 2 డిపో వారితో మాట్లాడి. శనివారం కొత్త బస్సు సర్వీస్ ను ఏర్పాటుకు రూట్ సర్వే (ట్రైన్ రన్) చేయడం జరిగింది. బస్ సర్వీసును రూట్: చిత్తూరు-తిరుపతి. వయా కొత్తపల్లిమిట్ట, మంగుంట, ఆళ్లమడుగు, శ్రీనివాసపురం, దిగువ పల్లాలు, జాండ్లపేట, సోమేంద్రపురం, మాకుమంబాపురం, చవటగుంట, తిరుపతి,మార్గంలో ప్రయాణించుటకు ఆర్టీసీ సిబ్బంది బస్సు నడుపుటకు శనివారం బస్సు రావడం జరిగింది. దీనిపై గ్రామస్తులు డిప్యూటీ సీఎం నారాయణస్వామికి, జిల్లా జనరల్ సెక్రెటరీ కామసాని పద్మనాభ రెడ్డికి అన్ని గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.










