Jul 26,2023 16:56

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండల కేంద్రంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక సహకార సంఘం భవనం మరియు సచివాలయం బైరెడ్డిపల్లి. గంగినాయన పల్లి. వైయస్సార్ రైతు భరోసా కేంద్రం దేవదొడ్డి బైరెడ్డిపల్లి భవనాలను వైయస్సార్ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి. ఎంపీపీ రెడ్డప్ప వారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా బుధవారం ఉదయం  ప్రారంభించారు. అనంతరం భవనం నిర్మాణ కాంట్రాక్టర్లకు మంత్రివర్యులు చేతుల మీదుగా కండువా కప్పి గౌరవించడం జరిగింది. వీరి వెంట ఎంపీ రెడ్డప్ప, పలమనేరు నియోజకవర్గం శాసనసభ్యులు వెంకటేగౌడు. డిసిసిబి బ్యాంక్ చైర్పర్సన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి. ఎంపీపీ రెడ్డప్ప. వైస్ ఎంపీపీలు రూపాయి కుమార్ .నారాయణస్వామి తాసిల్దార్ కుమారస్వామి. ఎంపీడీవో రాజేంద్ర బాలాజీ.  స్థానిక సర్పంచ్ కొమ్ము వెంకటేష్. విఆర్ఓ రాజేష్. పంచాయతీ కార్యదర్శి సదాశివయ్య. రాజశేఖర్ ఆచారి.జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమము జిల్లా ఇన్చార్జి డాక్టర్ సందీప్ . జిల్లా ఎపిడిమాలజిస్ట్ శ్రీవాణి వైద్యాధికారులు బైరెడ్డిపల్లి మండల వైద్య అధికారులు డాక్టర్ విజయ చందర్ డాక్టర్ శాలిని డాక్టర్ అరుణ్ . హెల్త్ ఎడ్యుకేటర్ సావిత్రి .మరియు పిహెచ్సి సిబ్బంది సచివాలయ సిబ్బంది మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్లు వైయస్సార్ పార్టీ మండల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.