Oct 09,2023 18:42

రిలే నిరాహర దీక్షలు చేస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ వారు కోర్టులో దాఖలు చేయు ప్రతీ పిటిషన్‌ పైన రూ. 20 వెల్ఫేర్‌ స్టాంపును అంటించాలని తీసుకున్న ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా కందుకూరు రెవెన్యూ డివిజన్‌ ఆఫీస్‌ ఎదురుగా సోమవారం న్యాయవాధులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.ఆ నిర్ణయం సామాన్య ప్రజానీకానికి ఇబ్బందికరంగా ఉంటుందని, తక్షణమే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. కందుకూరు న్యాయవాదులు సంఘం అధ్యక్షులు మామిడిపల్లి మల్లికార్జున రావు, సీనియర్‌ న్యాయవాదులు బెజవాడ కష్ణయ్య చౌదరి, సన్నేబోయిన శ్రీనివాస్‌ నాయుడు, పేదేటి భాస్కర్‌ రావు, బక్క మంతల వెంకటేశ్వర్లు, కొత్తూరు హరి కోటేశ్వరావు, పండిట్‌ సంపత్‌ కుమార్‌, టి వెంకటేశ్వరరావు, దారా మాధవరావు, సింహాద్రి,ఎస్‌ పవన్‌ కుమార్‌ ఉన్నారు.