న్యాయవాదుల నిరసన
ప్రజాశక్తి- పలమనేరు:మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పలమ నేరు న్యాయ వాదులు పలమనేరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట శుక్రవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా ప్లకార్డులను చేతబట్టి 'మేము సైతం చంద్రబాబుతోనే ' అంటూ నినాదాలు చేశారు. చట్ట విరుద్ధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు చేశారని దాన్ని పూర్తిగా తాము వ్యతిరేకిస్తున్నామని న్యాయవాదులు లక్ష్మీపతి, ఎల్. భాస్కర్,లోకేష్, జగదీష్,కష్ణలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణ నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీగా వస్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులకు పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తాము నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అంటూ పోలీసుల తీరుకు నిరసనగా న్యాయవాదులు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో లక్ష్మణ్, సుబ్బరామయ్య, షరీఫ్, కష్ణ, ఫామీద్ బాషా, మునిరాజులు, పార్థసారథి, చంద్ర, గాంధీ,రాజు, రాజశేఖర్, సంధ్య,చాందిని పాల్గొన్నారు.










