ప్రజాశక్తి-వెదురుకుప్పం : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న నలిపి రెడ్డి నవ్య నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నిక కావడంతో ప్రధానోపాధ్యాయులు పి వెంకటరమణారెడ్డి శనివారం నవ్యాను అభినందిస్తూ మెమెంటో ను అందజేశారు. మండలంలోని తంగేళిమిట్ట గ్రామ వాస్తవ్యులు నలిపిరెడ్డి విజయ,పార్ధ రెడ్డి తమ కుమార్తె నవ్య స్కాలర్షిప్ కు ఎన్నిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఏటా తమ పాఠశాల పిల్లలు ఎన్ ఎం ఎం ఎస్ కు అర్హత సాధిస్తూ పాఠశాల ఘనతను చాటుతూ ఉండటంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. నవ్యకు గైడ్ టీచర్లుగా వ్యవహరించిన జోత్స్న, ఆదిమూలపు మస్తాన్ బాబు, శ్రీనివాసులు, డా:ముని కృష్ణయ్య, సి ఆర్ పి అంకయ్య లకు ప్రధానోపాధ్యాయులు శుభాభినందనలు తెలియజేశారు. విజయలక్ష్మి, పుత్తూరు మురళిరెడ్డి, భ్రమరాంబ, శ్యామల,కమలనాభన్, గోపాల్,గౌతమ్, డాక్టర్ బండిప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.










