ప్రజాశక్తి - తిరుపతి టౌన్
గురువారం మధ్యాహ్నం నూతన తాత్కాలిక కలెక్టరేట్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయాన్ని జేసీ రెవెన్యూ రాజాబాబు, ఆసరా రాజశేఖర్, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డితో కలిసి పరిశీలించారు. హైవేవద్ద బస్టాప్, సిగల్స్ ఏర్పాట్లు జరగాలన్నారు. కలెక్టరేట్‌లో కార్యాలయాల వివరాలు తెలిపే సూచిక బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాలు ఏర్పాటు చేయాలని, రికార్డురూమ్ ఏర్పాటు అన్ని సేఫ్టీ మెజర్స్‌తో పూర్తి చేయాలన్నారు. స్పందన, రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా గ్రౌండ్‌ఫ్లోర్ అనుకూలమన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా క్యాంపు కార్యాలయాన్ని కలెక్టర్ నివాసంగా పునరుద్ధరణ చేపట్టాలన్నారు. కలెక్టర్ పర్యటనలో తుడ సెక్రటరీ లక్ష్మి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ దేవానంద్, ఇఇ సుధాకర్‌రెడ్డి, డిఇలు ప్రసాద్, శ్రీధర్‌ప్రసాద్, తహశీల్దార్ లోకేశ్వరి పాల్గొన్నారు.










