Sep 02,2023 21:52

అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

        బహ్మసముద్రం : మండల పరిధిలోని తిప్పయ్యదొడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కెవి.ఉషాశ్రీచరణ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎంతో ఉపయోగాన్ని ఇస్తాయన్నారు. జగనన్న ప్రభుత్వం అంగన్‌వాడీలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొని సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.