Jun 28,2022 22:14

నూనె విక్రయాలపై విజిలెన్స్‌ దాడులు
ప్రజాశక్తి -ఎస్‌ఆర్‌ పురం

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంఆర్‌పి కన్నా అధిక రేట్లకు నూనె విక్రయిస్తున్నా, కాలం చెల్లిన నూనెను అమ్ముతున్న వివిధ నూనె దుకాణాలపై మంగళవారం విజిలెన్స్‌ సిఐ మల్లికార్జునరెడ్డి, అసిస్టెంట్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ విజరు కుమార్‌రెడ్డి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ సిఐ మల్లికార్జున్‌ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ పురం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ 49 కొత్తపల్లిమిట్టలో నూనె విక్రయిస్తున్న వివిధ దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వం, విజిలెన్స్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పల్లెటూర్లలో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు నూనె విక్రయిస్తున్నారని, కాలం చెల్లిన నూనెను అమ్ముతున్నారని ఫిర్యాదు అందడంతో మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపలంలో 13 నూనెదుకాణాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా దుకాణాలలో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు విక్రయిస్తున్న కాలం చెల్లిన నూనెలను విక్రయిస్తున్న వారిని గుర్తించి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మీమీ ప్రాంతాలలో ఎవరైనా ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు, కాలం చెల్లిన నూనెలను విక్రయించిన వినియోగదారులు విజిలెన్స్‌ అధికారులకు తెలియజేయాలన్నారు.