- ఎన్.క్యు.ఏ.ఎస్ సర్టిఫికేష్ ప్రధానం
- పీ హెచ్ సీ తరపున కలెక్టర్ నుండి అందుకున్న డాక్టర్ గాయత్రి
ప్రజాశక్తి- పిచ్చాటూరు: : పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్లు వైద్యాధికారి డాక్టర్ గాయత్రి తెలిపారు. సోమవారం తిరుపతిలో పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కలెక్టర్ వెంకటరమణ రెడ్డి చేతుల మీదుగా ఎన్.క్యు.ఏ.ఎస్ సర్టిఫికేష్ (నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ సర్టిఫికేషన్) ప్రధానం చేశారు. ఈ సర్టిఫికేషన్ ను పీ హెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ గాయత్రి అందుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి (పీ హెచ్ సీ)లలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం, మెరుగైన వైద్యం అందించడం, ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యులు, సిబ్బంది నడుచుకునే విధానం వంటి అంశాలపై కేంద్ర బృందం పీ హెచ్ సీ లను పరిశీలించింది. ఈ పరిశీలన అనంతరం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు బృందం నివేదిక సమర్పించింది. ఈ నివేదిక మేరకు పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుర్తించి నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ సర్టిఫికేషన్ కు ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం తిరుపతిలో జిల్లా కలెక్టర్ వెంకటరమణరెడ్డి చేతుల మీదుగా పిచ్చాటూరు పీ హెచ్ సీ వైద్యాధికారి గాయత్రికి అందించారు. పీ హెచ్ సీ కి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రెండవ వైద్యాధికారి హమీద్, మండల వైద్య ఉద్యోగులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.










