నత్తనడకన ప్రభుత్వ భవన నిర్మాణాలు ˜ కాంట్రాక్టర్లకు అందని బిల్లులు ˜ ఎప్పటికి పూర్తయ్యేనో...!
నత్తనడకన ప్రభుత్వ భవన నిర్మాణాలు
˜ కాంట్రాక్టర్లకు అందని బిల్లులు
˜ ఎప్పటికి పూర్తయ్యేనో...!
ప్రజాశక్తి -యాదమరి
మండలంలో పలు అభివద్ధి పనులకు సంబంధించి బిల్లులు అందకపోవడంతో ప్రభుత్వ భవన నిర్మాణ పనులు నత్త నడకంగా సాగు తున్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో యాదమరి మండలంలో 26 గ్రామ పంచాయతీల పరిధిలో నూతనంగా 18 సచివాలయాలు భవనాలు మంజూరు చేశారు. వాటికి ఒక భవనానికి 25 లక్షల నుంచి 40 లక్షలు వరకు అంచనా వ్యయం. మండలంలో 18 భవనాలు మంజూరైతే 13 పూర్తయ్యాయి. ఇంకా ఐదు భవనాలకు పనులు చేపట్లేదు. రైతులకు ఉపయోగకరంగా రైతు భరోసా కేంద్రాలు 17 మంజూరయ్యాయి. ఈ భవనాలకు అంచనా వ్యయం రూ.21 లక్షలు అయితే మండలంలో 17 భవనాలు మంజూరైతే 9 భవనాలు పూర్తయ్యాయి. ఎనిమిది భవనాలు పూర్తి కాలేదు. వైయస్సార్ హెల్త్ క్లినిక్‌లు 14 మంజూరు కాగా ఒక భవనానికి అంచనా వ్యయం రూ.17 లక్షలు ఐదు భవనాలు పూర్తయ్యాయి. తొమ్మిది భవనాల పనులు ఇంకా చేపట్లేదు. మండల పరిధిలో ప్రభుత్వ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని జిల్లా స్థాయి అధికారులు పదేపదే సమావేశాల్లో చెప్తున్నారు. కానీ మండలంలో మాత్రం పనులు నత్త నడకన సాగుతున్నాయి. అయితే నిర్మాణాలను సగానికి పైగా చేసినా గాని బిల్లులు సక్రమంగా రాకపోవడంతో కాంట్రాక్టర్లు భవన నిర్మాణ పనులు చేపట్టడంలో వెనకడుగు వేస్తున్నారు. అలాగే మండల పరిధిలో నిర్మాణాలు ప్రారంభం గానీ మిగిలిన భవనాలకు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం లేదు. దీంతో మండలంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణ పనులు నత్తనడుగున సాగుతున్నాయి. కొన్ని గ్రామపంచాయతీలు అయితే గ్రామ సచివాలయ భవనాలు ఆర్‌బికే సెంటర్లు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్లు పనులు ప్రారంభించలేదు. మండల పరిధిలో బల్క్ మిల్క్ సెంటర్లు 18 మంజూరయ్యాయి. వీటి అంచనా వ్యయం ఒకటికి రూ.17.64 లక్షలు అలాగే డిజిటల్ లైబ్రరీకి 26 మంజూరు కాగా భవన నిర్మాణానికి అంచనా వ్యయం ఒకటికి రూ.16 లక్షలు. అయితే ఈ భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు గుతేదారులు ఎవరు ముందుకు రాకపోవడంతో పనులు పూర్తిగా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో అందితే భవన నిర్మాణ పనులు వేగవంతం చేపడతామని ఇటు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. బిల్లులు సకాలంలో అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గుత్తేదారులు వాపోతున్నారు.హొ
సకాలంలో బిల్లులు చెల్లిస్తే పనులు చేపడతాం
హొప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తే నిర్మాణ పనులు సకాలంలో చేపట్టేందుకు వీలుంటుంది. పనులు చేసి సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో సచివాలయ భవన పనులు ఆపేసాం. చేసిన పనులకు బిల్లులు మంజూరైతే వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. - వరదరాజుల నాయుడు
అసంపూర్తి భవనాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం
మండల పరిధిలోని అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తిచేసేందుకు ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లులు కూడా ప్రభుత్వం నుండి మంజూరైన వెంటనే వారి ఖాతాలకు జమవుతుందని తెలిపారు. - శివరాజ్, మండల అభివద్ధి అధికారి, యాదమరి










