నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి
ప్రజాశక్తి- పుంగనూరు: ఏనుగుల వలన పంటలు నష్టపోయిన రైతులను అన్నివిధాల ఆదుకుంటామని అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి చెప్పారు. గురువారం పుంగునూరు అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగునూరు నియోజకవర్గ పరిధిలో సోమల మండలంలో రైతుల పంటలను ఏనుగులు సంచారం చేసి నష్టపరిచినట్లు తమ దష్టికి రావడం జరిగిందన్నారు. రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో పంట నష్టపోయిన రైతు పొలాల్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. మండలంలో అనేకమంది రైతులు పంట నష్టపోయినట్లు గుర్తించడం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అటవీ భూములను ఆక్రమించుకొని సాగుచేస్తున్న భూమిని స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఆక్రమణకు గురైన అటవీ భూములను ఎంతటి వారైనా వదిలేది లేదని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. అటవీ భూములను ఆక్రమిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిసిఎఫ్ నాగేశ్వరరావు, డి.చైతన్య కుమార్ రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ బాలకష్ణారెడ్డి, ముడా ఛైర్మన్ వెంకట్‌రెడ్డి యాదవ్, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, చైర్మన్ అలీమ్ భాష తదితరులు పాల్గొన్నారు.










