Mar 21,2023 21:38

వ్యవసాయ శాఖ కార్యాలయంలో వినతిపత్రం సమర్పిస్తున్న రైతుసంఘం నాయకులు

          ప్రజాశక్తి-శింగనమల   ఇటీవల కురిసిన భారీ వడగండ్ల గాలివానకు పంటలు నష్టపోయిన ప్రతిరైతుకూ నష్టపరిహారం చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం మండల కేంద్రంలోని కార్యాలయంలో మండల వ్యవసాయాధికారిణికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అకాల వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.లక్ష పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అరటి, దానిమ్మ, మామిడి, చీనీ రైతులకు ఎకరాకు రూ.లక్ష మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, వ్యకాసం మండల అధ్యక్షులు ఎర్రిస్వామి, రైతుసంఘం మండల అధ్యక్షుడు సుంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రామాంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ సూర్యప్రకాష్‌, లక్ష్మీపతి, కుళ్లాయప్ప, ఆంజనేయులు, శీనా, నాగయ్య, రామకృష్ణ, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.