ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా గురువారం నాగేష్ బాధ్యతలు స్వీకరించారు నాగేష్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా నార్పల ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేశారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వందలాదిమంది విద్యార్థులను వివిధ క్రీడల్లో తీర్చిదిద్దారు అదేవిధంగా పాఠశాల క్రీడల్లో ఎన్నో బహుమతులు సాధించి నార్పల పేరు జిల్లా స్థాయిలో వినిపించే విధంగా చేసిన ఘనత నాగేష్ కే చెందుతుంది. ఆయన వద్ద క్రీడల్లో ఓ నామాలు నేర్చుకున్న పలువురు విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదిగి నేడు పలు శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. తిరిగి ఆయన నార్పల బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా రావడం పట్ల పలువురు స్థానికులు క్రీడాకారులు ఆయన శిష్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఇకనుండి ఆయన శిక్షణలో బాలికలు కూడా వివిధ క్రీడల్లో నైపుణ్యాన్ని సాధిస్తారని అంటున్నారు. పదోన్నతుల్లో భాగంగా నార్పల బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లారెడ్డి బెలుగుప్ప మండల విద్యాధికారిగా వెళ్లారు. అదేవిధంగా నార్పల ప్రభుత్వ బాలుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై విద్యాధికారిగా పెద్దపప్పూరు మండలానికి వెళ్లడంతో రవికుమార్ నార్పల ప్రభుత్వ బాలుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు.










