Oct 15,2023 22:18

ఫొటో : నిరసన చేపడుతున్న టిడిపి నేతలు

నర్రవాడలో 'కాకర్ల' వైద్య సేవలు
ప్రజాశక్తి-ఉదయగిరి : దుత్తలూరు మండల పరిధిలో నియోజకవర్గ టిడిపి నాయకులు కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత కాకర్ల సురేష్‌ ఎన్‌టిఆర్‌ సంజీవని రథంతో ఉచిత వైద్యసేవలను అందించారు. ఆదివారం దుత్తలూరు మండల పరిధిలోని నర్రవాడ బిసి కాలనీ రామాలయం వద్ద 145వ రోజు అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితముగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 118 మంది గ్రామస్తులను వివిధ ఆరోగ్య సమస్యలను డాక్టర్లు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ వ్యవస్థాపకులు వైద్య శిబిరాన్ని సందర్శించి సంజీవని ఆరోగ్య రథం అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్తుల నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం గ్రామస్తులతో సమావేశమై గ్రామంలోని సమస్యలపై చర్చించారు. ఉచిత వృత్తి విద్య శిక్షణలో భాగంగా మహిళల అభివృద్ధికి తమ ట్రస్ట్‌ ద్వారా ఏర్పాటు చేసి మహిళలకు బ్యూటిషన్‌ టైలరింగ్‌ మూడవ బ్యాచ్‌ శిక్షణ యువతకు ఉచిత కార్‌ డ్రైవింగ్‌ అందిస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా పెళ్లి కానుకలు ఆరోగ్య సమస్యలకు ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. అనంతరం గ్రామస్తులతో చంద్రబాబు అక్రమ అరెస్టుపై నల్ల జెండాలతో నిరసన తెలిపారు.