ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం 2023 సంవత్సరానికి గాను నోబుల్ బహుమతులు పొందిన శాస్త్రవేత్తలు, వారు చేసిన పరిశోధనల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గురించి వక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి, రసాయన శాస్త్రంలో పరిశోధన గురించి బి. కమల బాబు, భౌతిక శాస్త్రం గురించి డాక్టర్ ఎన్వి. శ్రీహరి, సాహిత్య రంగంలో నోబుల్ బహుమతి గురించి డాక్టర్ పి. రాజగోపాల్, శాంతి బహుమతి గురించి కె. నరేష్ రాజా, ఆర్థిక శాస్త్రంలో బహుమతి గురించి డాక్టర్ సిహెచ్ .శంకర్రావు విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. ముగింపు ఉపన్యాసం చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవి కుమార్ కళాశాల అధ్యాపకుల యొక్క పరిశోధన స్వభావాన్ని, విద్యార్థులకు నూతన విషయాలు బోధించాలని తపనను కొనియాడారు. ఈ కార్యరకమం కళాశాల ఐక్యుఏసి, ఎన్.ఎస్.ఎస్, లైబ్రరీ మరియు ఇంటర్ ఫ్యాకల్టీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించారు.










