పెట్రోల్ బంకు
రేణిగుంట : బుధవారం ఉదయం నుండి రేణిగుంట చెక్ పోస్ట్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంకు వద్ద 'నో స్టాక్ బోర్డు' పెట్టారు. వినియోగదారులు పెట్రోల్ యాజమాన్యాన్ని అడిగితే పెట్రోల్, డీజిల్ స్టాక్ రాలేదని.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరిగాయని, ఈ కారణంగా బయటనుండి రావలసినంత పెట్రోల్, డీజల్ రావడంలేదని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి 'నో స్టాక్ బోర్డులు' పెడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కె.హరినాథ్ డిమాండ్ చేశారు.










