Jul 30,2022 21:26

నివేదికలు సరే.. క్షేత్రస్థాయిలో పనులెక్కడ: ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు
ప్రజాశక్తి- బంగారుపాళ్యం:
నివేదిక్లు సరే క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్‌.బాబు అన్నారు. శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అమరావతి ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖలు నివేదికలు సంతప్తిని వ్యక్తం చేస్తున్నాయని, గ్రామస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యలపై స్పందన లేకుండా ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. రాబోవు సమావేశంనకు క్షేత్రస్థాయిలో పనులు చేసిన ప్రజాసమస్యలపై నివేదికలు తయారు చేయాలని ప్రభుత్వ సంక్షేమఫలాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ జిల్లా వ్యవసాయసలహా మండలి చైర్మన్‌ పాలకూర రామచంద్రారెడ్డి, జడ్పిటిసి సోమశేఖర్‌, సింగల్‌ విండో చైర్మన్‌ దత్తాత్రేరెడ్డి, వైస్‌ ఎంపీపీలు శిరీష్‌రెడ్డి. జయకుమార్‌, ఎంపీడీవో గౌస్‌ బాషా, తహశీల్దార్‌ బెన్‌రాజ్‌, కో-ఆప్షన్‌ నెంబర్‌ ఫిరోజ్‌ అహ్మద్‌, మండల స్థాయి అధికారులు, సర్పంచులు ప్రసాద్‌రెడ్డి, కోక ప్రకాష్‌ నాయుడు, వాణి ప్రియ, ఉమాదేవి, మురళి, భారతి ఎంపీటీసీలు హేమచంద్ర, ఉషారాణి పాల్గొన్నారు.
అనంతరం సిఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బంగారుపాలెంకు చెందిన భవ్యకు రూ.లక్ష, కల్పనకు రూ.37వేలు, తంబుగానిపల్లెకు చెదిన పంకజంకు రూ.70వేలు చెక్కులను అందనేశారు. అలాగే మండల ఆసుపత్రి అభివద్ధి కమిటీ సమావేశం వైద్య అధికారి మురళి ఆధ్వర్యంలో సమావేశంలో పాల్గొని వైద్యులు రోగులపట్ల ప్రేమానురాగాలతో పలకరించాలని ఎమ్మెల్యే సూచించారు.