Jul 10,2023 21:09

నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం నాయకులు

        ప్రజాశక్తి-గుంతకల్లు   పేద, మధ్య తరగతి ప్రజలు కొని తినలేని స్థాయిలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక పొట్టి శ్రీరాములు కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలు కొనలేని స్థితిలో నిత్యావసర సరుకుల ధరలు ఉండగా 'మూలిగే నక్కపై తాటిపండు' పడ్డట్టు కూరగాయల ధరలు ఆకాశాన్ని చేరాయన్నారు. దీంతో ప్రజలు ఏం కొనాలో ఏం తినాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల పరిస్థితులను గుర్తించి వెంటనే రైతుల దగ్గర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసి ప్రభుత్వ చౌకధాన్యపు డిపోల్లో సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మారుతీప్రసాద్‌, జగ్గిలి రమేష్‌, పట్టణ కమిటీ సభులు సాకే నాగరాజు, కసాపురం రమేష్‌, పట్టణ నాయకులు దాసరి చరణ్‌, రామునాయక్‌, తిమ్మప్ప, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెంకీ, చందు, ఆవాజ్‌, నాయకులు షాషా, ఖాదర్‌, తదితరులు పాల్గొన్నారు.