ప్రజాశక్తి-పాకాల : మన నిత్య జీవితంలో సైన్స్ చాలా ప్రాముఖ్యత ఉన్నదని పాకాల మండలం విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు. గాదంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారని అన్నారు. మన జీవితం సైన్స్ తో ముడి పడి ఉందని, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అని అన్నారు. పూర్వ కాలంలో ఒక చోట నుండి ఒక చోటకు వార్తలు రావాలంటే పక్షులను ఉపయోగించే వాళ్ళని, తర్వాత ఉత్తరాలు వచ్చాయని అన్నారు. కానీ వార్త అందవలసిన సమయంలో అందేది కాదని అన్నారు. కానీ ప్రస్తుతం సెల్ ఫోన్లు, ట్యాబ్ ల వల్ల ఎప్పటికప్పుడు వార్త అందుతుందని అన్నారు. ఎంతో మంది సైన్స్ ను అభివృద్ధి చేసారని, కానీ కొంతమంది టెక్నాలజీ వినశనానికి వాడుతున్నారని అన్నారు. టెక్నాలజీ అనేది కేవలం మానవాళికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్షించిన ప్రదర్శనలు తిలకించారు. ఉత్తమ ప్రదర్శన లకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సి.ఆర్.పి.లు, ఉదయ్ పాల్గొన్నారు.










