నిష్పక్షపాతంగా పోలీసు విచారణ
అసత్యాలు , వదంతులు వ్యాప్తి చేస్తే కఠినచర్యలు : ఎఎస్‌పి శ్రీలక్ష్మి హెచ్చరిక
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పెనూమూరు మండలంలో 16ఏండ్ల బాలిక అనుమానస్పద మృతిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని విచారణ పూర్తి అయిన తరువాత నిజానిజాలు వెళ్లిడి చేయడం జరుగుతుందని, పోలీసులు నిష్పక్షపాతంగా హత్యకేసును విచారిస్తున్నట్లు ఎఎస్‌పి శ్రీలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఎస్పీ మాట్లాడారు. ఈ కేసు విషయంలో సోషియల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడంతో పాటు మైనర్ పేరును ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. అసత్యాలు, వందతులు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెనుమూరు బాలిక హత్యపై ఈనెల 18వ తేదీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేయడం జరిగిందని, సెక్షన్ 133, 174 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 18వ తేదీ పెనుమూరు మండలం, కావూరివారిపల్లి పంచాయతీ, తానా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునిక్రిష్ణయ్య తన 16 సంవత్సరాల కూతురు పెనుమూరు టౌన్‌లో గల ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నదని, అప్పటికి మూడురోజులుగా ఆమెకు జ్వరంగా ఉండడంతో కాలేజీకి పోకుండా ఇంటివద్దనే ఉందని, 17వ తేదీ సాయంత్రం 6గంటల నుండి కనపడకుండా పోయినదని, చుట్టుపక్కల అంతా విచారించినా ఆమె ఆచూకీ తెలియలేదని దీంతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి వెనువెంటనే దర్యాప్తు ప్రారంభించడమైందని, ప్రాథమికంగా అమ్మాయి తల్లిదండ్రుల ఫోన్‌నంబరు ఆధారంగా అమ్మాయికి దర్యాప్తు మొదలుపెట్టి ఎవరితోనైనా వెళ్లి ఉండవచ్చునేమో అనే కోణంలో దర్యాప్తు చేస్తూ వున్న సమయంలోనే 20వ తేదీ రాత్రి సుమారు ఉదయం 9 గంటల సమయంలో వినాయక విగ్రహాల నిమజ్జనంకు వెళ్ళిన ఊరి జనాలకు గ్రామ సమీపంలో గల ఎగువచెరువు గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డి వ్యవసాయబావిలో ఒక మహిళ మతదేహం తేలుతూ కనిపించిందని తెలిపారు. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీయగా సదరు అమ్మాయి శవం తమ కూతురిగా తల్లిదండ్రులు గుర్తించినట్లు తెలిపారు. తమ కూతురి మరణంకు సంబంధించి నలుగురు యువకులపై అనుమానంగా వున్నదని, వారే తమ కూతురిపై ఏదైనా అఘాయిత్యం చేసి చంపి బావిలో పడేసి ఉంటారని ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చారు. సదరు కేసును 21వ తేదీ మిస్సింగ్ కేసు నుండి అనుమానాస్పద మృతిపై సెక్షన్ 174 నమోదు చేసి మృతదేహంను శవపరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి వారి వద్దకు పంపడమైందని తెలిపారు. పోస్టుమార్టంలో అమ్మాయి శవంపై పైకి కనపడే ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని, అలాగే అమ్మాయి ఏదైనా అఘాయిత్యానికి గురైందాకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మాయి నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయినదా లేక ఎక్కడి నుండి అయినా తెచ్చి ఆమెను మరణానంతరం బావిలో పడేశారా అని తెలుసుకోవడం అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సాంపిల్స్ రిపోర్టులు వచ్చేలోపు ఈ కేసులో అనుమానితులుగా వున్న నలుగురు వ్యక్తులను విచారించడం జరుగుతున్నదని తెలిపారు. వారి కాల్ డీటెయిల్స్, టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా వారికి ఈ కేసులో వున్న సంబంధం గురించి టెక్నికల్‌గా నిర్ధారించుకుని సదరు విచారణలో తెలియవచ్చే విషయాలకు, ఫోరెన్సిక్ రిపోర్టు ఫలితాలను క్రోదీకరించుకొని వాటి ఆధారంగా సమగ్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఈకేసులో అసలైన నిందితులు ఎవరైనా వుంటే ఖచ్చితంగా శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని, నిందితులు ఎవరైనా వుంటే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు.
బాలిక హత్య కేసు పురోగతి
ఈ కేసులో మతురాలికి గుండు చేయించి హత్యచేసి బావిలో పడేశారని ఆరోపణ మేరకు మరియు పోస్టుమార్టం రిపోర్టులో మెడికల్ ఆఫీసరు గారు అమ్మాయి శవము మూడు రోజుల పాటు నీళ్ళలో వుండి పూర్తిగా వెంట్రుకలు ఊడిపోయే అవకాశముందని అమ్మాయి వెంట్రుకల గురించి నేరస్థలముగా వుండు పాడుబడిన బావిలో వున్న నీటిని పోలీసు యంత్రాంగం వారు సుమారు 5 గంటల పాటు శ్రమించి మోటార్ల సహాయంతో తోడి పరిశీలించగా మృతురాలి వెంట్రుకలు కుదుళ్ళతో సహా బయటపడినది. సదరు వెంట్రుకలను కూడా పరీక్షల నిమిత్తం తిరుపతి ల్యాబ్ కు పంపుతున్నట్లు తెలిపారు. అమ్మాయికి గుండు గీయించి పడేశారని వచ్చిన అపోహలు నీరదారంగా పోలీస్‌శాఖ భావిస్తున్నట్లు తెలిపారు.










