Apr 23,2023 22:11

ప్రజాధనం వృధా అని విమర్శలు
ప్రజాశక్తి - ఆకివీడు

             ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాలు మారిపోవడం సర్వసాధారణం అయిపోయింది. టిడిపి హయాంలో ఇంటింటికి వైద్యం అందించిన సంచార వైద్యానికి వినియోగించిన వాహనాలు పొదల మాటుకు చేరాయి. ఆ పనిముట్లు చెత్తగుట్టల పాలయ్యాయి. రూ.లక్షలు వెచ్చించి ఖరీదు చేసిన ఆ వాహనాలు నేడు నిరుపయోగంగా మూలన పడి ఉన్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా పనిముట్లు, వస్తువులు నిరుపయోగంగా మారుతున్నాయి. రూ.లక్షల ప్రజాధనం వృధా అవుతుంది. ఒక ప్రభుతం హయాంలో పథకాల అమలు కోసం రూ.లక్షలు వెచ్చించి పనిముట్లు ఏర్పాటు చేస్తాయి. పనిముట్లు, వస్తువులు, వాహనాలు సిద్ధమయ్యేనాటికి ప్రభుత్వం మారిపోతుంది. ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన అనంతరం ఆ పథకాలు అమల్లోకి తీసుకోకపోయినా వస్తువులు, వాహనాలు వినియోగించుకుంటే పర్వాలేదు. లేకపోతే రూ.లక్షలు వెచ్చించి సిద్ధం చేసిన ఆ వస్తువులు చెత్తగుట్టల పాలవుతున్నాయి. లేదా పక్కదారి పడుతున్నాయి. దీంతో రూ.కోట్లలో ప్రజాధనం వృధా అవుతుంది. ఈ ధనం మొత్తం తిరిగి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వందల వాహనాలు మూలనపడ్డాయో, ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.