Aug 23,2023 22:58

అధికారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నిర్ణీత గడువులోగా భూసేకరణ చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పలు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఆర్‌అండ్‌బి, ఏపీఐఐసి, అహుడా, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, సంక్షేమ హాస్టల్‌ భవనాలకు సంబంధించి భూముల కేటాయింపు విషయమై వేగవంతంగా భూసేకరణ చేపట్టాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ప్రాజెక్టులకు సకాలంలో భూసేకరణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు మధుసూదన్‌, నిశాంత్‌ రెడ్డి, రవీంద్ర, ఎపిఐఐసి జడ్‌ఎం వరప్రసాద్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుధారాణి, బీసీ వెల్ఫేర్‌ డిడి కుష్బు కొఠారి, డిటిడబ్ల్యువో అన్నాదొర పాల్గొన్నారు.