నిరంతర విద్యుత్తు ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్నాం
జెడ్పి ఛైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తితో పాటు పంపిణీ రంగంలో భారీమార్పులు తీసుకురావడంతో విద్యుత్‌కోతల నుంచి మిగులు విద్యుత్ వరకు రావడం జరిగిందని జిల్లా పరిషత్ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. ఉజ్వల భారత్.. ఉజ్వల భవిష్యత్ 2047 కార్యక్రమంలో భాగంగా చిత్తూరులోని బిఆర్ అంబేద్కర్ భవనంలో బిజిలి మహౌత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లాపరిషత్ చైర్మన్ విచ్చేసి మాట్లాడారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా క్షణం విద్యుత్తు కోత జరిగితే భరించలేని పరిస్థితి ఏర్పడిందని, పారిశ్రామిక వ్యవసాయ రంగాలు పూర్తిస్థాయిలో విద్యుత్‌పై ఆధారపడి ఉన్నాయని అన్నారు. గతంలో ధర్మల్ విద్యుత్తు, జల విద్యుత్తు ఉండగా ప్రస్తుతం సోలార్, హైడల్ విద్యుత్తు తయారీకి సిద్ధమన్నారు. ఇటీవల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ రంగానికి, గహ అవసరాలకు విద్యుత్ కనెక్షన్లు మరింత సులభతరంగా పొందేలా చేశారన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ మాట్లాడుతూ ఆజాది కా అమత్ మహౌత్సవ్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో పర్యావరణాన్ని కాపాడే విధంగా హైడల్, సోలార్ విద్యుత్ మీద ఎక్కువ దష్టి సారించారని, ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలో ఒక హైడల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం, సోలార్ విద్యుత్ కోసం ఎంఓయూలు కుదుర్చుకోవడం జరుగుతోందన్నారు. చిత్తూరు మేయర్ మాట్లాడుతూ గతంలో విద్యుత్ ఎపుడు వస్తోంది పోతోంది తెలిసేది కాదని ప్రస్తుతం నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు. ఎన్‌టిపిసి డైరెక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్తు వాడకం గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతోనే మీటర్లను ఏర్పాటు చేయాలని భావించడం జరిగిందని, రైతులకు ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కష్ణారెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మొత్తం 3.81లక్షల ఇంటి సర్వీసులు ఉన్నాయని ఇందులో ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి 95వేల కనెక్షన్లు ఉన్నాయని వారికి ప్రభుత్వం 200యూనిట్ల వరకు సబ్సిడీ ఇస్తుందని ఇందుకు సంవత్సరానికి 24కోట్లు ప్రభుత్వం భరిస్తోందన్నారు. ఈ వర్గాల వారు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 24గంటల లోపల సర్వీసింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల రంగానికి సంబంధించి రాయితీఇవ్వడం జరుగుతుందని వ్యవసాయ రంగంకు 9గంటల నాణ్యమైన విద్యుత్తు పగటిపూట నిరంతరాయంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. లోఓల్టేజ్ సమస్యను తీర్చడానికి అదనపు ట్రాన్స్ఫార్మర్లు సమకూర్చడంతో పాటు నూతనంగా పలు లైన్లను వేయడం జరిగిందని 16 కెవిఏ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే గతంలో లక్ష రూపాయలు చెల్లించాల్సి వచ్చేదని ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో 12,500 నామమాత్రపు చార్జీతో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని 592 జగనన్న కాలనీలలో విద్యుత్ వసతి కల్పించబడిందని జలకళ పథకం ద్వారా 114 మందికి విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో విదేశి వ్యవహారాల ఇన్‌చార్జి జ్ఞానేంద్రరెడ్డి, చిత్తూరు ఎంఎల్‌ఎ శ్రీనివాసులు, చుడ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, పిఎంకె వుడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, విద్యుత్తు శాఖ అధికారులు హరి, అమీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.










