ప్రజాశక్తి-కలకడ : నిండు ప్రాణానికి రెండు చుక్కలు అన్న నినాదంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రకోట పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్ కుమార్ రెడ్డి, విజయలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు పల్స్ పోలియో పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల లోపు గల పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పల్స్పోలియో కార్యక్రమంపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అపోహలను విడిచిపెట్టి పిల్లలు అంగవైకల్యం నుండి దూరంగా ఉండేందుకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈనెల 27వ తేదీ అనంతరం 28 వచ్చేనెల ఒకటో తేదీన ఇల్లిల్లు తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఈ ఓ జయరామయ్య, సుధాకర్ రాజు, సుబ్బా రత్నమ్మ, సరస్వతమ్మ, లక్ష్మీ నరసమ్మ, షేక్ ఇస్మాయిల్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










