Oct 26,2023 19:45

మాట్లాడుతున్న డిఎస్‌పి

మాట్లాడుతున్న డిఎస్‌పి
నిందితుడు అరెస్ట్‌

ప్రజాశక్తి-కావలి:ఈనెల 22తేదీ రాత్రి జనతాపేట నార్తు 1వ వీధీ ఆంజనేయస్వామి గుడివీధిలో మంచాల మాల్యాద్రి ఇంటిలో నగలు దొంగలించి, తిరిగి వెళుతుండగా తనను గుర్తుపట్టిన మంచాల రమణమ్మ (84)ను సుత్తితోకొట్టి గాయపరిచారు. మరుసటిరోజున ఆమె ఆస్పత్రిలో మృతిచెందింది.
దీనికి కారకుడైన తిరుపతి వరప్రసాద్‌ నిందితుడిని సిఐ సుధాకర్‌ గురువారం అరెష్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు కావలి డిఎస్‌పి వెంకటరమణ వెల్లడించారు. స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముద్దాయి గతంలో జవహర్‌భారతి డిగ్రీకాలేజీలో డిగ్రీఫెయిలయినట్లు, కావలిలో ఎవరైనా ఇళ్లు ఖాళీచేస్తుంటే ఫ్యాకేజి బారుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనం జరిగిన ఇంటి యజమాని మంచాల మాల్యాద్రికి అప్పుడప్పుడు చిన్న,చిన్న పనులు చేసిపెట్టేవాడన్నారు. 22వ తేదీన ఉదయం మాల్యాద్రి మార్నింగ్‌వాక్‌కి వెళ్లిఉండగా, ఇంట్లో ఎవరూ లేరనుకుని నిందితుడు సుమారు 8గంటల సమయంలో వాళ్ల ఇంటిలోని బెడ్‌రూములోనికి వెళ్లాడు. అక్కడే ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి తాళాలు తీసుకుని, బీరువా తెరచి అందులో ఉన్న నల్లపూసల దండచ నెక్లెస్‌, రెండు జతల నగలు, సుమారు 5సవర్లు (వాటి విలువ రూ.1,65,000)బంగారు నగలను దొంగిలించాడు. ,యథావిధిగా బీరువా తాళాలువేసి, మళ్లీ వాటిని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టేశాడన్నారు.ఎవరికీ అనుమానం రాకుండా కిందికి దిగివస్తుండగా కింద హాలులో ఉన్న మంచాల రమణమ్మ(మృతురాలు)అతనిని చూసి గుర్తుపట్టిందన్నారు. ఆసమయంలో నిందితుడు తనతో తెచ్చుకున్న సుత్తితో తలపై గాయపరచి ,ఆమె స్పృహకోల్పోగా, పక్కనే ఉన్న దివానా కాట్‌పైపడవేసి పారిపోయాడన్నారు. మరుసటిరోజున వృద్దురాలు హాస్పిటల్‌లో మృతిచెందిందన్నారు. నిందితుడిని, చోరీసొత్తుతో సహా పట్టుకున్నారు. ఈసందర్భంగా సి.ఐ. సుధాకర్‌ను, అతని సిబ్బందిని అభినందించారు.