Apr 23,2023 22:16

ప్రజాశక్తి - పాలకొల్లు
             నిమ్మకాయ ధర లకు రెక్కలొచ్చాయి. నాణ్యమైన నిమ్మకాయ రూపాయికి వచ్చేది. అయితే ఇప్పుడు రూ.5 నుంచి రూ.8 వరకు పెరిగింది. దీంతో వేసవిలో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం రేటు అధికంగా ఉండటంతో పిందె దశలోనే నిమ్మకాయలు కోసి వేయడంతో నాణ్యత లేని నిమ్మకాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. వేసవిలో నిమ్మకాయ వాడకం ఎక్కువగా ఉంటుంది. వేసవి తాపానికి నిమ్మసోడా ఎక్కువగా వాడుతారు. గత నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో భారీ వర్షాల కారణంగా అన్ని రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గి రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.