నిజమైన పేద అసైన్డ్ దారులకు
అన్యాక్రాంతమైన భూములను అప్పగించాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్
ప్రజాశక్తి-పలమనేరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సుద్వారా నిజమైన పేదలనుండి ఏ కారణం చేతనైనా అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి వారికి లేదా వారి వారసులకు అప్పగించాలని వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వారం పలమనేరు గాంధీ పార్కులో చిత్తూరు జిల్లా వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశా నికి ముఖ్య అతిథిగా సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి హంగేరి ఓబులరాజు మాట్లాడుతూ జిల్లాలో అసైన్డ్ లబ్దిదారుల లిస్టులు ఇప్పటి వరకు ఏ మండలంలో ప్రకటించలేదని, కలెక్టరు చొరవ తీసుకొని వెంటనే అసైన్డ్ భూముల లిస్టులు ప్రకటించాలని తెలిపారు. ఈ లిస్టులు ప్రకటించినట్లు అన్ని గ్రామాల్లో దండోరా వేయించి అభ్యంతరాలు తెలపడానికి సమయం వారం రోజులు లేకుండా నెలరోజులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలకు ముందు అన్యాక్రాంతమైన భూములను తిరిగి ఎవరికి అప్పగిస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఇది ఈ రాష్ట్రంలో పేదలైన అసైన్డ్ లబ్ది దారులకు అన్యాయం జరుగుతుందనే భయాందో ళనలో పేదలు, దళితులు ఉన్నారని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఈ అనుమానాలను నివత్తి చేసి అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి అసలైన లబ్దిదారులకు లేదా వారి వారసులకు స్వాధీనం చేసి న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వాధీనం లో ఉన్న భూములు, అనర్హుల చేతిలోని ప్రభుత్వ భూములను తీసుకొని భూమిలేని పేద, దళితులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ప్ర క్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జిల్లా యం త్రాంగం నిజాయితీగా, చిత్తశుద్ధితో వ్యవహరించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో వి.కోట, గంగ వరం, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి, పలమనేరు, కుప్పం మండ లాల ముఖ్యమైన నాయకులు గోపి, వేణు, గణేష్, శివ, సుందర్, బాబు, వెంకటముని తదితరులు పాల్గొన్నారు.










