Oct 24,2023 21:51

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: నిజం గెలవాలి అంటూ నారా భువనేశ్వరి చేపడుతున్న సభలను విజయంతం చేయాలని తెలుగు మహిళా జిల్లా నాయకులు అరుణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 45 రోజులుగా నారా చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారని అక్రమ అరెస్టులను నిరశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారనే అక్కసుతోనే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. నిజం గెలవాలంటూ నారా భూవనేశ్వరి జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా నాయకులు మాజీ ఎంపీపీ శాంతమ్మ గంగాధర్‌ నెల్లూరు మండలం మహిళా అధ్యక్షురాలు లోకమ్మ సెక్రటరీ భువనేశ్వరి గంగాధర్‌ నియోజకవర్గ తెలుగు మహిళలు గీతమ్మ, గాయత్రి యాదవ్‌ పాల్గొన్నారు.