ప్రజాశక్తి-పెద్దపంజాణి:
గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఏ.శ్రీరాములు (45) బసవరాజుకండ్రిగ సమీపంలో గల అడవికి కట్టెలు కోసం వెళ్ళి గిడ్డ చెంగప్ప పొలంలో గల ఉపాధిహామీ పథకంలో చేపట్టిన నీటి నిల్వ గుంటలో నీరు త్రాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారిపడిపోయాడు. కేకలు వేయడంతో స్థానిక రైతులు కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే శ్రీరాములు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనను స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. శ్రీరాములు భార్య కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.










