Mar 31,2022 22:31

డ్రమ్ములను అందిస్తున్న దృశ్యం




ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
మంగళంలోని ప్రభుత్వ బాలుర గృహానికి గురువారం హెల్పింగ్‌ టు అదర్స్‌ సంస్థ వ్యవస్థాపకులు కొట్రమంగళం మణికంఠ ఆధ్వర్యంలో ఇక్కడి పిల్లల ఉపయోగార్ధం 3 నీటి డ్రమ్ములను విరాళంగా అందించారు. వీటిని గృహం పర్యవేక్షణాదికారి పివి.రామమనోహర్‌, ఉప పర్యవేక్షణాదికారి బి.మోహన్‌బాబులకు సమక్షంలో ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కె.శ్రీనివాస్‌, మదనమోహన్‌ పాల్గొన్నారు.