Sep 07,2022 22:59

నిఘా నీడలో నగరి
జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి
ప్రజాశక్తి-నగరి:
జిల్లాల విభజనల అనంతరం ప్రధానమైన నగరాల్లో క్రైమ్‌ రేట్లను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తులను ముమ్మరం చేసిందని జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం నగరిలో సీసీటీవీ కెమెరాల ప్రత్యేక క్యాబిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమైన నగరాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా ఒక కమాండింగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకుని, ప్రతి కదలికలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా నేరానికి తావు లేకుండా చూసుకునేలా కట్టుదిక్కమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక విభాగం, ప్రత్యేక అధికారులను నియమించామని, నగరిలో కూడా ప్రధాన కూడలిలో దాదాపు 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలించడానికి సీసీటీవీ ఏర్పాట్లకు కషిచేసిన నగరి ఇన్స్పెక్టర్‌ శ్రీనివాసంతిని ఇతర నగరి పోలీసు సిబ్బందిని అభినందించారు. అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్‌) శ్రీనివాసులు, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, రూరల్‌ సీఐ రాజశేఖర్‌, కార్వేటినగరం సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ శివశంకర, నిండ్ర ఎస్‌ఐ వెంకటసుబ్బమ్మ, విజయపురం ఎస్‌ఐ నరేష్‌, సచివాలయం ఎంఎస్‌కెలు పాల్గొన్నారు.