Aug 02,2023 22:22

ట్రాఫిక్‌పై సిబ్బందికి సూచనలిస్తున్న డీఐజీ అమ్మిరెడ్డి

     అనంతపురం క్రైం : వాహనదారులు నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేయాలని డిఐజి ఆర్‌ఎస్‌.అమ్మిరెడ్డి ట్రాఫిక్‌ పోలీసు సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా బుధవారం అనంతపురం నగరంలోని ప్రధాన రోడ్లును పరిశీలించారు. ట్రాఫిక్‌ కి అడ్డంకిగా మారుతున్న అంశాలపై నిశితంగా పరిశీలించారు. ఎక్కడ టౌన్‌ న్యూసెన్స్‌ అధికంగా ఉందో ఆయా ప్రదేశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కావన్నారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపినా, నో పార్కింగ్‌ ప్లేస్‌లో పార్కింగ్‌ చేసినా టౌన్‌ న్యూసెన్స్‌ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాదరెడ్డి, ట్రాఫిక్‌ సిఐ వెంకటేష్‌ నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.