Jul 16,2023 21:10

బ్యాంకు ఓబులేసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

       ప్రజాశక్తి-ఉరవకొండ   నిబద్ధతకు మారుపేరు వైసిపి పట్టణ అధ్యక్షుడు చల్లా (బ్యాంకు) ఓబులేసు అని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కొనియాడారు. ఆదివారం స్థానిక ఉరగాద్రి కళ్యాణ మండపంలో మాజీ జెడ్పిటిసి తిప్పయ్య అధ్యక్షతన బ్యాంకు ఓబులేసు సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఓబులేసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఓబులేసుతో తనకున్న సాన్నిహిత్యన్ని గుర్తుకు చేసుకున్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా, ఉద్యోగం వచ్చాక బ్యాంకు ట్రేడ్‌ యూనియన్‌ నేతగా, రిటైర్‌మెంట్‌ తర్వాత వైసిపి నాయకుడిగా పని చేసి అందరి మన్ననలు పొందారన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తూ స్వలాభం కాకుండా ఎదుటివారికి కష్టమొచ్చినా తన సొంత పనిగా భావించేవారన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మీసాల రంగన్న, బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రమణ, వైసిపి బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, వైస్‌ ఎంపిపి నరసింహులు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ తేజోనాథ్‌, పెన్నఅహోబిలం ఆలయం మాజీ ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌, గ్రామీణ బ్యాంకు రిటైర్డ్‌ రీజినల్‌ మేనేజర్‌ రంగన్న, రిటైర్డ్‌ మేనేజర్లు గోవిందరెడ్డి, బాలకృష్ణ, సుబ్బరాయుడు, ఫక్రుద్దీన్‌, మాజీ ఎంఇపపిలు ఎసి ఎర్రిస్వామి, నాగేశ్వరరావు, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నేత కృష్ణప్ప, శ్రీనివాసులు ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు ఓబులేసు, ఎర్రిస్వామి, ఓబులేసు కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.