Aug 17,2023 22:16

నగరపాలక స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో
పలు టెండర్లకు ఆమోదం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో జరిగింది. నగర మేయర్‌ ఎస్‌.అముద, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, డిప్యూటీ మేయర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌, జిఆర్‌.శ్రీకాంత్‌, సీ.శోభ, బి.పూర్ణచంద్రరావు సమావేశంలో పాల్గొన్నారు. ఈసమావేశంలో భాగంగా అజెండా అంశాలపై చర్చించి ఆమోదించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పిలిచిన టెండర్లను ఎల్‌1గా నిలిచిన వారికి ఏల్‌ఓఏ జారీ చేయుటకు కమిటీ ఆమోదించింది. 14 విలీన పంచాయతీల్లో తాగునీటి బోరు మోటర్ల నిర్వహణకు, అత్యవసర మంచినీటి సరఫరా దష్ట్యా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం పిలిచిన టెండర్లలో ఎల్‌1గా నిలిచిన వారికి ఏల్‌ఓఏ జారీచేయుటకు కమిటీ ఆమోదించింది. అమత్‌ పథకం కింద అపెక్స్‌ కమిటీ, ఎంవోహెచ్యుడీ ఆమోదం తెలిపిన పనులకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం ముద్ర వేసింది. సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంఈ వెంకట ప్రసాద్‌, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, ఏసీపీ రామకష్ణుడు, సీఎంఎం గోపి పాల్గొన్నారు.