నగరపాలక స్టాండింగ్ కమిటీ సమావేశం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం శనివారం నగరపాలక కార్యాలయంలో జరిగింది. నగర మేయర్ ఎస్.అముద, కమిషనర్ డాక్టర్ జె.అరుణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు, డిప్యూటీ మేయర్ ఆర్.చంద్రశేఖర్, సి.శోభ, బి.పూర్ణచంద్రరావు సమావేశంలో పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో భాగంగా నాగయ్య కళాక్షేత్రంలో పాడైన ఎయిర్ కండిషనర్ల స్థానంలో సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు, ఇతర మరమ్మతులకు 2023-24 బడ్జెట్ సాధారణ నిధులు వ్యయం చేయుటకు, టెండర్లు పిలుచుటకు స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఎయిర్ కండిషన్ల ఏర్పాటు కోసం పిలిచిన టెండర్లలో అర్హత గల బిడ్డరుకు ఎల్‌ఓఏ జారీ చేయడం, సి.డి.ఎం.ఏ వారి ఆదేశాల మేరకు నగరంలోని దర్గా కూడలిలో ట్రాఫిక్ సిగల్ ఏర్పాటుకు కమిటీ ఆమోద ముద్ర వేసింది. సమావేశంలో ఎంఈ గోమతి, ఎంహెచ్వో డాక్టర్ లోకేష్, మేనేజర్ తనూజ, డీఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.










