- మేయర్ ఎస్.అముద
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్: నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని నగర మేయర్ ఎస్.అముద కోరారు. నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ శిక్షణ ప్రాంగణంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, వాటర్ వర్క్స్ కార్మికులకు నైపుణ్యాభివద్ధి శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నగరపాలక కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ ఎస్.అముద మాట్లాడుతూ చేసే పనిలో నైపుణ్యాలను అందిపుచ్చుకోని మేరుగైన సేవలందించేలా ఉండాలన్నారు. కమిషనర్ పి.విశ్వనాథ్ మాట్లాడుతూ వత్తి నైపుణ్యాలను మారుతున్న కాలానికి అనుగుణంగా పెంపొందించుకోవడం ద్వారా వత్తిలో మెరుగ్గా రాణించగలరని, ఇందుకోసమే నగరపాలక సంస్థ కార్మికులకు న్యాక్ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ ఆర్. చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి నగరపాలక సంస్థకు మంచి పేరు తేవాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కార్మికులకు ద్రువపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ చిత్తూరు కేంద్రం ఇంచార్జ్ నారాయణ రెడ్డి, అధ్యాపకుల విజరుకుమార్, మునియప్ప, డేవిడ్ శాంతకుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.రామ్మూర్తి, చిత్తూరు నగరపాలక, పలమనేరు పురపాలక సంఘం కార్మికులు పాల్గొన్నారు.










