
ప్రజాశక్తి - శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ కూడలి సమీపంలోని అండర్ డ్రైనేజీ పనులు చేపడుతున్నందున ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నట్లు శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్‌పి సిహెచ్.జి.వి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో ప్రధాన రోడ్డు ఏడు రోడ్ల కూడలి నుంచి డే అండ్ నైట్ కూడలి మీదుగా ఆర్‌టిసి కాంప్లెక్స్ వైపు పాలకొండ రోడ్డులో డే అండ్ నైట్ సమీపంలో అండర్ డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రూట్-1లో ఏడు రోడ్ల కూడలి నుంచి కాంప్లెక్స్‌కు వెళ్లాల్సిన వాహనాలు (కారు, ఆటో, ద్విచక్ర వాహనాలు) డే అండ్ నైట్ కూడలి వద్ద సింధూర ఆస్పత్రి రోడ్డు మీదుగా ఆర్ట్స్ కళాశాల రోడ్డు, అంబేద్కర్ కూడలి నుంచి కాంప్లెక్స్‌కు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
రూట్-2లో జాతీయ రహదారి నుంచి కిమ్స్ రోడ్డు మీదుగా నగరంలోకి వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జికి ఎడమ వైపు తిరిగి సింధూర ఆస్పత్రి రోడ్డు మీదుగా ఆర్ట్స్ కళాశాల రోడ్డు, అంబేద్కర్ కూడలి నుంచి కాంప్లెక్స్‌కు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
రూట్-3లో ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి అంబేద్కర్ కూడలి, డే అండ్ నైట్ కూడలి మీదుగా ఏడు రోడ్ల కూడలికి వెళ్లే వాహనాలకు ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. విశాఖపట్నం నుంచి నగరంలోకి వచ్చే ఆర్‌టిసి, ప్రయివేటు బస్సులు కిమ్స్ రోడ్డు మీదుగా కాకుండా కొత్తరోడ్డు మీదుగా కాంప్లెక్స్‌కు రావాల్సి ఉంటుందని తెలిపారు.
శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి విశాఖపట్నం, విజయనగరం వైపు వెళ్లే ఆర్‌టిసి, ప్రైవేటు బస్సులు బలగ ఆస్పత్రి కూడలి మీదుగా కొత్తరోడ్డు నుంచి జాతీయ రహదారికి వెళ్లాలని సూచించారు. కాంప్లెక్స్ నుంచి డేఅండ్‌నైట్ కూడలి మీదుగా ఏడురోడ్ల కూడలికి పాతబస్టాండ్ నుంచి కాంప్లెక్స్ వైపు బస్సులు, భారీ వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈనెల 11వ తేదీ నుంచి డ్రైనేజీ పనులు పూర్తయ్యే వరకు కొనసాగుతాయని తెలిపారు.