Jul 07,2022 22:38

నగరిలో ముదిరిన గ్రూప్‌ రాజకీయం
రాజశేఖర్‌రెడ్డి జయంతి ఫ్లెక్సీల ఏర్పాటులో బహిర్గతం
ప్రజాశక్తి - పుత్తూరు

నగరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గ్రూప్‌ రాజకీయం ముదిరి పాకాన పడింది. నియోజకవర్గ ప్రధాన కూడళ్లలో ఒకటైన నాగలాపురం కూడలిలో వైసిపిలోని ఓ గ్రూపుకు చెందిన నాయకుడు జనవరి 25, 2014న రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుత సిఎం జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అప్పటినుంచి రాజశేఖర్‌ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని చాటుతూ జయంతి, వర్థంతి రోజుల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే మరో వర్గం ఫ్లెక్సీల ఏర్పాటును అనుచర గణంతో అడ్డుకోవడంతో వివాదం రగులుకుంది. ఈ వివాదం పోలీసుల చెంతకు చేరింది. అయితే పోలీసులు సైతం అడ్డుకున్న వారికే మద్దతు ప్రకటించారని సమాచారం. పోలీసుల ఎదుటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చింపేస్తామని చెప్పడం గమనార్హం. దీంతో మొదటినుంచి రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై అభిమానంతో ఉన్న గ్రూపు గుర్రుగా ఉంది.