నగరాభివృద్ధికి పటిష్ట చర్యలు
సమీక్షలో కలెక్టర్ ఎం. హరినారాయణన్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించి, జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అవసరమైన అభివద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో చిత్తూరు నగర అభివద్ధికి సంబంధించి కలెక్టర్ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో కలసి మునిసిపల్ కమిషనర్ అరుణ, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ అభివద్ధిపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు నివేదికలను సమర్పించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా నగర పాలక పరిధిలో డ్రైనేజీ వ్యవస్థలు చక్కదిద్దెందుకు పలు కాలనీలు, ప్రధాన కూడళ్లలో నూతన డ్రైనేజీలను నిర్మించడం, పాడైన వాటిని మరమ్మతుల చేయడం తద్వారా వర్షాలు కురిసినప్పుడు నిమిషాల్లోనే వర్షపు నీరు వెళ్లిపోయేలా, పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అలాగే స్ట్రీట్‌లైట్స్, తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నగరవాసుల జీవన ప్రమాణాలను పెంపొందించి, ఆహ్లాదకర వాతావరణం అందించడంలో భాగంగా పార్కుల అభివద్ధి తదితర అంశాలపై దష్టి సారించాలని కలెక్టర్ కమిషనర్‌కు సూచించారు. గంగినేని చెరువు, కట్టమంచి చెరువు వద్ద పచ్చదనం పెంపునకు చర్యలు చేపడుతున్న నగర పాలకసంస్థ పరిధిలో మొత్తం పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 50 డివిజన్‌ల పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి తడి, పొడిచెత్తను వేరువేరుగా సేకరించడం జరుగుతున్నని, 11వ వార్డుల్లో ప్రత్యేకక్లాప్ వాహనాల ద్వారా ఇంటింటి చెత్తసేకరణ జరుగుతున్నదని కమిషనర్ కలెక్టర్‌కు వివరించారు.










