ప్రజాశక్తి-రాయదుర్గం ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నగర వనం అభివద్ధిపై ఏమాత్రం శ్రద్ధ చూపక పట్టణ ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం ఆయన టిడిపి హయాంలో రూపుదిద్దుకున్న నగరవనంపై ఆరో వీడియోను విడుదల చేశారు. ప్రజల వినోదం కోసం అటవీ శాఖ ద్వారా పట్టణ శివారులో రూ.2 కోట్లతో నగర వనం పార్కును అభివద్ధి చేయడంతో పాటు భవిష్యత్తులో రూ. 25 కోట్ల ఖర్చుతో విస్తరించాలనుకున్నా మన్నా రు. అయితే వైసిపి ఏలుబడిలో అది అంతులేని నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. నగర వనంలో ని ఏనుగు, పులి, జింక, తదితర జంతువుల బొమ్మలు రంగు మారి శిథిలావస్థకు చేరాయన్నా రు. పిల్లల ఆటవిడుపు పరికరాలు దెబ్బతిన్నాయన్నారు. పట్టణ ప్రజలు కుటుంబాలతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో తాము నగర వనం పార్కు ఏర్పాటు చేయించామని తెలిపారు. ఇలాంటి అభివద్ధి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎందుకు కొనసాగించలేకపోయారో ప్రజలు ప్రశ్నించాలన్నారు. పట్టణ ప్రజల పై 'కాపు' విద్వేషపూరితంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇకనైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నగర వనాన్ని అభివద్ధి చేయాలని కాలవ విజ్ఞప్తి చేశారు.
నగర వనం వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు










